గొల్లపల్లి డ్యామ్లో ఐదుగురు మహిళల మృతి

AP : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ విహారయాత్రకు వెళ్లిన ఐదుగురు మహిళలు స్నానానికి దిగి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఒకరిని కాపాడే ప్రయత్నంలో అందరూ చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో పెనుకొండ పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.


