గుంటూరులో కారులో మంటలు.. ఒకరు మృతి!
గుంటూరు జిల్లా. ఇందిరా ప్రియదర్శిని కాలనీలో విషాదం! సాయిబాబా దేవాలయం సమీపంలో మారుతి బలెనో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఇద్దరు ఉన్నారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. మరొకరు కారులోనే చిక్కుకుని మంటలకు ఆహుతయ్యారు. మృతుడిని తాడికొండ హరికృష్ణ (53)గా లాలాపేట పోలీసులు గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మంటలు ఎందుకు చెలరేగాయి? పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



