← Back to news

అరకులోయలో గురజాడ 164వ జయంతి

By Appalanaidu· 1d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులోయలో గురజాడ 164వ జయంతి

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి జరిగింది. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి మాట్లాడుతూ, గురజాడ రచనలు సామాజిక చైతన్యానికి దర్పణమని అన్నారు. "దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్" అనే సందేశం నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు. వ్యాసరచన, కవిత, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

More in Local