← Back to news

గద్వాల్‌లో దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

By ARJUN· 13h ago· Jammiched, Gadwal, Jogulamba Gadwal
గద్వాల్‌లో దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

గద్వాల్ పట్టణంలో మానసిక దివ్యాంగులకు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో గద్వాల్ జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అర్హులైన వారికి వైద్యపరీక్షలు పూర్తయిన అనంతరం సదరం ధ్రువపత్రాలు జారీ చేస్తామని తెలిపారు. టోకెన్ల విధానంలో రద్దీ లేకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా బుక్ చేసుకున్న 92 మందిలో 58 మంది చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.

గద్వాల్‌లో దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

More in Local