← Back to news

బొజ్జా తారకం పోరాటం చిరస్మరణీయం

By DK· 6h ago
బొజ్జా తారకం పోరాటం చిరస్మరణీయం

పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా ప్రజానికానిదే అంటూ జీవించిన పీడిత ప్రజానాయకుడు బొజ్జా తారకం 10వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్స్ కమిటీ ఆయన సేవలను స్మరించుకుంటోంది. పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసిన నాయకుడిగా, న్యాయవాదిగా, కవి, రచయితగా, ఉపన్యాసకుడిగా తారకం సేవలను ప్రజాస్వామికవాదులు గుర్తుచేసుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్‌గా పనిచేశారు. క్యాన్సర్‌తో బాధపడిన బొజ్జా తారకం 2016 సెప్టెంబర్ 16న మృతి చెందారు.

More in TG