← Back to news

గురుకులంలో విద్యార్థులతో పనులు!

By A.Ajay· 2h ago
గురుకులంలో విద్యార్థులతో పనులు!

TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వంట, ఇతర పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సెప్టెంబరు 28న సాయంత్రం విద్యార్థులతో కట్టెలు కొట్టించిన సమయంలో ఓ విద్యార్థికి పంటికి గాయమైనట్లు సమాచారం. ఈ ఘటనలో వాచ్‌మెన్‌ను బాధ్యుడిగా చూపేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఘటనపై జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టి నిజాలు తేల్చాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

More in TG