← Back to news

కుట్టుమిషన్’ పథకానికి పోటెత్తిన మహిళలు

By A.Ajay· 2h ago
కుట్టుమిషన్’ పథకానికి పోటెత్తిన మహిళలు

TG: రాష్ట్ర ప్రభుత్వం BC మహిళల కోసం చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకానికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. సెప్టెంబర్ 30 నాటికి 4.70 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లు ఇవ్వనున్నారు. మిషన్ విలువ సుమారు 12 వేలు కాగా, 100 శాతం సబ్సిడీపై అందించనున్నారు. 18 నుంచి 55 ఏళ్ల BC మహిళలు ఈ పథకానికి అర్హులు.

More in TG