← Back to news

ఇవాళ, రేపు ప్రజావేదిక కార్యక్రమం రద్దు

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
ఇవాళ, రేపు ప్రజావేదిక కార్యక్రమం రద్దు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో ప్రతిరోజూ నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమాన్ని అక్టోబర్ 1, 2 తేదీల్లో రద్దు చేశారు. TDP అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ జరగనుంది. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజా వేదిక నిర్వహించరు.

More in Local