అరకు మండల పరిషత్ పీఠం ఎవరిదో..?

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల పరిషత్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2001లో కాంగ్రెస్, 2006లో TDP, 2014లో YSRCP, 2021లోనూ YSRCP మండల పరిషత్ పీఠాన్ని దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో 2026 ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గత ఫలితాలే పునరావృతమవుతాయా? లేక కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.


