114 మందికి CMRF చెక్కులు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చొరవతో తిరుమలాయపాలెం మండలానికి చెందిన 114 మంది లబ్ధిదారులకు రూ.35.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ అయ్యాయి. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్యాంప్ ఇన్‌చార్జి తుంబురు దయాకర్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ సాయం ఉపయోగపడుతోందని దయాకర్ రెడ్డి అన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాల సహాయం అందేలా కృషి చేస్తామన్నారు.



