బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

వరంగల్ నగరంలో బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని GWMC కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నవడ్డేపల్లి, బేస్తం చెరువు, ఉర్స్ చెరువు, బంధం చెరువు, పద్మాక్షి గుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. చెరువుల పరిసరాల్లో పారిశుధ్యం, లైటింగ్, తాగునీరు, భద్రత, బారికేడ్ల ఏర్పాట్లపై సూచనలు చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.


