సింగిల్ ట్రాక్ తిప్పలు... దేవగిరి ఎక్స్‌ప్రెస్ 40 mins లేట్

నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 3:55కు రావాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ 4:20కి వచ్చింది. ప్లాట్‌ఫారమ్ ఒకటిపై ఆగిన ఆ రైలు అదనంగా 20 నిమిషాలు నిలిచి, చివరికి 4:42కి కదిలింది. మొత్తం 40 నిమిషాల ఆలస్యం. సింగిల్ ట్రాక్ ఉండటంతో ఎదురుగా వస్తున్న ఇంటర్ సిటీ కోసం ఆగాల్సి వచ్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఉప్పల్ వాయిలోనూ ఇదే పరిస్థితి. ముంబై వలస కార్మికులకు దేవగిరి ఏకైక రైలు. ఈ లైన్‌లో డబుల్ ట్రాక్ చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.




