పర్సనాలిటీ రైట్స్ మీద ఢిల్లీలో అక్కినేని నాగ చైతన్య కేసు !!

తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వాయిస్ వాడుతున్న వారిపై నటుడు అక్కినేని నాగచైతన్య దాఖలు చేసిన 'పర్సనాలిటీ రైట్స్' కేసులో ఢిల్లీ హైకోర్టు త్వరలోనే కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. తన పేరును అశ్లీల వెబ్‌సైట్లలో వాడటం, మాజీ భార్య సమంతతో కలిపి ఏఐ (AI) డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించడం, యూట్యూబ్‌లో వ్యక్తిగత ట్రోలింగ్‌కు పాల్పడటం వంటి వాటిపై చైతన్య కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం నిందితులకు సమన్లు జారీ చేస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణకు పరిమితులు ఉంటాయని పేర్కొంది. త్వరలోనే దీనిపై తీర్పు నివ్వనుంది.



