తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. కొన్ని జిల్లాలకు ఎల్లో Alert!

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డిలోనూ వర్షాలు పడొచ్చని సూచించింది. APలో కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు నుంచి 5 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పింది. వర్షాల టైమ్‌లో గాలులు బలంగా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, కరెంట్ పోల్స్, భారీ హోర్డింగ్స్ దగ్గర ఉండొద్దని అలర్ట్ చేసింది.



