గీతం డీమ్డ్ యూనివర్సిటీలో Teachers Day

గీతం డీమ్డ్ యూనివర్సిటీ, స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో Teachers Dayను ఘనంగా నిర్వహించారు. సంస్థలోని అధ్యాపక బృందానికి కృతజ్జతలు తెలిపారు. భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్జుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళి అర్పించారు. ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేసి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయుల అమూల్యమైన సేవలను ఈ వేడుక గౌరవించింది.


