← Back to news

అరకులోయలో ఓటరు జాబితాలపై గ్రామసభలు

By B V Appalanaidu· 2h ago· Alluri Sitharama Raju
అరకులోయలో ఓటరు జాబితాలపై గ్రామసభలు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలోని పలు పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటరు జాబితాల ఆమోదానికి గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభల్లో ఓటర్ల వివరాలను చదివి వినిపించి, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఆమోదాలను నమోదు చేసినట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. కార్యక్రమాల్లో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెదలబుడు, మాదల గ్రామసభలకు ఎంపీడీఓతో పాటు డిప్యూటీ ఎంపీడీఓ హాజరై ప్రక్రియను పరిశీలించారు.

More in Local