← Back to news

పర్యాటకులను కట్టిపడేసిన పాకాల అందాలు

By A VIJAY KUMAR· 2h ago· Narsampet (Ct), Narsampet, Warangal

TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల బయోడైవర్సిటీ పార్కు పచ్చదనంతో కళకళలాడింది. ఆదివారం సెలవు కావడంతో పార్కుకు వచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సరస్సు పరిసరాలు పచ్చగా మారి కనువిందు చేశాయి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోయింది. గతేడాది ఇదే సమయంలో పాకాల చెరువు మత్తడి పరవళ్లు తొక్కుతూ కనువిందు చేయగా, ఈసారి మాత్రం ఆ స్థాయిలో నీటి ప్రవాహం కనిపించకపోవడం గమనార్హం.

More in Local