మంగళగిరిలో ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిప్పర్లబజారులో అంజుమన్ షాదీఖానాలో ఐదు జిల్లాల ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్-2026 నిర్వహించారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి సుమారు 220 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా చెస్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ సహకారంతో ఎన్ఆర్ఎం చెస్ అకాడమీ పోటీలను నిర్వహించింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత కోనేరు అశోక్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.





