← Back to news

మంథనిలో 11 ఆవులు పట్టివేత

By VGRAO· 1d ago· Karimnagar, Karimnagar, Karimnagar
మంథనిలో 11 ఆవులు పట్టివేత

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కూచిరాజపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు చిన్న ట్రాలీల్లో ఆవులను కరీంనగర్‌కు తరలిస్తుండగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ సోమన్న, ఎండీ తుఫాన్ కలిసి ఆవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆవులతో పాటు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం మంథని పోలీసులకు అప్పగించారు.

More in Local