గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన రాష్ట్ర కల్లు గీతా కార్మిక సంఘం 69వ వార్షికోత్సవ వేడుకలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నాయకులు తరలివెళ్లారు. సిద్దిపేట జిల్లా నాయకుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు కొయ్యడ కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.


