← Back to news

సమ్మక్క సారక్క జిల్లా సమైక్య అధ్యక్షురాలిగా సరిత

By Praveen· 1d ago
సమ్మక్క సారక్క జిల్లా సమైక్య అధ్యక్షురాలిగా సరిత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమ్మక్క సారక్క జిల్లా సమైక్య అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి పదవుల కాలపరిమితి ముగియడంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఘనపూర్ మండలం చెల్పూర్‌కు చెందిన ముదురుకోళ్ల సరిత అధ్యక్షురాలిగా, టేకుమట్లకు చెందిన గువాడి రజిత కార్యదర్శిగా, మల్హర్ మండలం కొయ్యూరుకు చెందిన మీసాల సౌజన్య కోశాధికారిగా ఎన్నికయ్యారు. మహిళా సంఘం సమైక్య సభ్యులు ఈ ఎన్నికలు నిర్వహించారు.

More in Local