← Back to news

గూడూరులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఆందోళన

By Bala· 16h ago

జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై నిరుపేద కుటుంబాలు ఆందోళనకు దిగాయి. అర్హులైన పేదలకు ఇళ్లు దక్కేలా కలెక్టర్‌ జారీ చేసిన డ్రా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించి న్యాయంగా ఇళ్లను కేటాయించాలని కోరారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు.

More in Local