బాలకృష్ణ చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం

AP: సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చొరవతో చిలమత్తూరు బీసీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. రూ.7.5 లక్షలతో నూతన పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. పైప్‌లైన్ పనులు పూర్తయితే కాలనీవాసులకు తాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారానికి నిధులు మంజూరుపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.



