← Back to news

నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి

By siva· 1h ago
నాగులేరుకు నీళ్లు విడుదల చేయాలి

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో నాగులేరుకు నీటిని విడుదల చేయాలని స్థానికులు కోరారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్ల బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు. సాగర్ కుడికాలువకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నాగులేరుకు కూడా నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు. నాగులేరులో నీరు చేరితే భూగర్భ జలాలు పెరిగి బోర్లకు నీరు అందే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు.

More in Local

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు
Local· 22m ago

మైల్వార్‌లో రేకుల షెడ్డు ధ్వంసం.. పోలీసులకు ఫిర్యాదు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఆన్‌లైన్ సెంటర్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు ధ్వంసం కావడం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన ఉప్పర్ నగేష్ పాఠశాల ఎదుట ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటుకు రేకుల షెడ్డు నిర్మించారు. పంచాయతీ అనుమతులు లేవంటూ అదే గ్రామానికి చెందిన ఇబ్రహీం అభ్యంతరం వ్యక్తంచేసి కర్రతో షెడ్డు ధ్వంసం చేసినట్లు నగేష్ ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇబ్రహీంపై చర్యలు తీసుకోవాలని బషీరాబాద్ PSలో ఫిర్యాదు చేశారు.