ప్రకాశం బ్యారేజీపై వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
డీఎస్సీ అవకతవకలపై నిరసనకు వెళ్తున్న మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, కార్యకర్తలను పోలీసులు ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకున్నారు. వాళ్లు విజయవాడలోని SAAP కార్యాలయానికి వెళ్తున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. శాంతియుత ధర్నాను అడ్డుకోవడం సరికాదని వేమారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చేందుకే పోలీసులను అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కార్యకర్తలే తమకు అండ అని అన్నారు. బ్యారేజీపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.



