గల్ఫ్ వెళ్తున్నారా.. ఏజెంట్స్‌తో జాగ్రత్త!

గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు భారీగా డబ్బులు వసూలు చేసి డూప్లికేట్ వీసాలు, తప్పుడు డాక్యుమెంట్స్ ఇస్తున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు మహిళలు ఉద్యోగాల కోసం వెళ్లి, అక్కడ వేరే పనులు చేయాల్సి వచ్చిందని, పాస్‌పోర్టులు తీసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్‌కు వెళ్లే ముందు ఏజెంట్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ వద్ద నమోదై ఉన్నాడో లేదో పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు.



