పాఠశాలకు ఉపాధ్యాయుల చేయూత

మధ్యాహ్న భోజనం వంటకు కట్టెలతో ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పరిష్కారం చూపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని పాఠశాలలో సమస్యను గుర్తించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సొంత నిధులతో గ్యాస్ స్టవ్‌ను అందజేశారు. అలాగే పాఠశాల అవసరాల కోసం రూ.18 వేల విలువైన మ్యూజిక్ సిస్టమ్‌ను సమకూర్చారు. మధ్యాహ్న భోజనం వంటకు సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఈ సహకారం అందించారు.





