← Back to news

విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

By Prakash· 1d ago· Bejjanki, Bejjanki, Siddipet
విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మెదక్ పట్టణం ఆటోనగర్‌లో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడాన్ని సిద్దిపేట జిల్లా బెజ్జంకి రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. విగ్రహ ధ్వంసం అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, విగ్రహానికి రక్షణ కల్పించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

More in Local