తొత్తడాం రామాలయానికి విరాళం

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గుంపాం పంచాయతీ తొత్తడాం గ్రామంలో రామాలయ నిర్మాణానికి 2లక్షల విరాళం అందించేందుకు కొవ్వాడ గ్రామ మాజీ సర్పంచ్, జనసేన సీనియర్ నాయకుడు కోట్ల రఘు ముందుకొచ్చారు. గ్రామ పెద్దలు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, జనసేన నాయకులు ఆయనను కలిసి ఆలయ నిర్మాణానికి సహాయం చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కోట్ల రఘు 2 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలో నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి చేతులమీదుగా ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు.



