← Back to news

మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి: మంత్రి

By Bala· 3h ago· TG
మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలి: మంత్రి

కోదాడలో నెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వీడియో ద్వారా యువతకు పిలుపునిచ్చారు. జాబ్ మేళాలో సుమారు 300 కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అర్హత ఉన్న యువత పెద్ద సంఖ్యలో హాజరై తమకు అనుకూలమైన ఉద్యోగాలను పొందాలని మంత్రి ఉత్తమ్ సూచించారు.

More in TG