హైడ్రాకి సుప్రీంకోర్టులో షాక్

శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ భూమి కేసులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టి వేసింది. సికింద్రాబాద్.. కంటోన్మెంట్.. లోతుకుంటలోని 40 ఎకరాల భూమి.. తమదేనని ప్రభుత్వం ఈ పిటిషన్ వేసింది. ఐతే.. ఈ పిటిషన్‌ని 219 రోజులు ఆలస్యంగా వేశారంటూ సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆ 40 ఎకరాల భూమి శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌కి చెందుతుందని ఇదివరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిని సీజ్ చెయ్యాలనుకున్న హైడ్రాకి సుప్రీం షాక్ ఇచ్చినట్లైంది.

