← Back to news

పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సాధించిన సాయి వరుణ్

By Ramesh· 1d ago· Sublaidu, Tirumalayapalem, Khammam
పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సాధించిన సాయి వరుణ్

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన సాయి వరుణ్ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. అమ్మమ్మ అల్లి యశోద దగ్గర పెరిగాడు. రఘునాథపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఏన్కూర్ గురుకులంలో సెకండరీ విద్య పూర్తి చేశాడు. 2025-26 ఎంసెట్‌లో 2088 ర్యాంక్ సాధించి వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నాడు. జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ ఆయనను సన్మానించారు. గ్రామ పెద్దలు గౌని మల్లయ్య, తక్కెళ్ళపల్లి నరేందర్ రావు, యర్రబోయిన వెంకటేశ్వర్లు, కోండ్రు మహేష్ అభినందించారు.

పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సాధించిన సాయి వరుణ్
పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సాధించిన సాయి వరుణ్

More in Local