← Back to news

ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఎస్పీ

By DK· 20h ago
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు: ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు 75 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, శాంతిభద్రతలు, పౌర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

More in Local