← Back to news

గన్నోర్‌లో ఒకే మట్టి గణేశ్‌.. ఐక్యతతో ఉత్సవాలు

By Digamber Adla· 12h ago· Brahmangaon, Mudhole, Nirmal
గన్నోర్‌లో ఒకే మట్టి గణేశ్‌.. ఐక్యతతో ఉత్సవాలు

TG: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర్ గ్రామంలో ఒకే మట్టి గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఉత్సవాలను నిర్వహించేలా సర్పంచ్‌ అప్పల రాజు తీసుకున్న చొరవను గ్రామస్థులు అభినందించారు. ఉత్సవాల నిర్వహణ తీరును ముథోల్ ఎస్సై బిట్ల పెర్సిస్‌ కూడా అభినందించారు. పర్యావరణ పరిరక్షణ, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు గ్రామ ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

More in Local