← Back to news

సెప్టెంబర్ 17న ప్రతి తండాలో ప్రత్యేక కార్యక్రమం

By DK· 3h ago
సెప్టెంబర్ 17న ప్రతి తండాలో ప్రత్యేక కార్యక్రమం

సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తండాలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్‌లో గిరిజన నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సి. లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమాలపై పిలుపునిచ్చారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో అభివృద్ధి జరిగిందన్నారు.

More in Local