HYD ట్రాఫిక్‌కు చెక్..కొత్తగా నాలుగు టెర్మినల్స్

TG: HYD నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఆధునిక బస్సు టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్‌లో టెర్మినల్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే interstate, interdistrict బస్సులను నగరంలోకి రాకుండా టెర్మినల్స్ వద్దే నిలిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి ప్రయాణికులు సిటీ బస్సులు, MMTS, మెట్రో ద్వారా నగరంలోకి వెళ్లేలా రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.


