← Back to news

భగ్గుమనే ఎండలు!

By Krishna· 1h ago· Gov
భగ్గుమనే ఎండలు!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్టోబర్ 1న హై టెంపరేచర్స్ ఉంటాయి. తెలంగాణలో 34 డిగ్రీల సెల్సియస్, APలో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. గాలి వేగం గంటకు 20 నుంచి 25 కిలోమీటర్లుగా ఉంటుంది. IMD ప్రకారం.. రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ 3 వరకూ అక్కడక్కడా జల్లులు పడతాయి. మొత్తంగా వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయి. బంగాళాఖాతంలో ద్రోణి తరహా వాతావరణం ఉన్నా.. దాని ప్రభావం AP, తెలంగాణపై ప్రస్తుతానికి లేదు. అందువల్ల వర్షాలు పడే ఛాన్స్ చాలా తక్కువ.

More in Current Affairs