‘ఎపిక్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా అక్టోబర్ 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మూవీని చూడొచ్చు. ‘90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కాలేజ్ లైఫ్, యూత్ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.



