← Back to news

జీవో 76పై కాంగ్రెస్ డ్రామాలు: కొప్పుల ఈశ్వర్

By Sagar· 1d ago· Ramagundam, Ramagundam, Peddapalli
జీవో 76పై కాంగ్రెస్ డ్రామాలు: కొప్పుల ఈశ్వర్

జీవో నంబర్ 76, 28 అంశాలను కార్మికులు, వారి కుటుంబాలకు స్పష్టంగా తెలియజేయడానికి మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సింగరేణిలో సానుకూల మార్పులు తీసుకొచ్చి కార్మికులకు అండగా నిలిచింది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. జీవో 76 ద్వారా కార్మికులకు న్యాయం జరగలేదని, ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, TGBKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు.

జీవో 76పై కాంగ్రెస్ డ్రామాలు: కొప్పుల ఈశ్వర్

More in Local