హాస్టల్ ఫుడ్‌తో 31 మంది స్టూడెంట్స్‌కి అస్వస్థత

TG: నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ స్కూల్ హాస్టల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తిన్న 31 మంది ఇంటర్ స్టూడెంట్స్‌కి కడుపునొప్పి, అసౌకర్యం కలిగింది. వారిని దగ్గర్లోని PHCకి తెసుకెళ్లారు. మెరుగైన ట్రీట్‌మెంట్ కోసం 12 మందిని జిల్లా హాస్పిటల్‌కి తరలించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఫుడ్ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి, వార్డెన్‌ను తొలగించారు.


