← Back to news

గణపతి పూజ చేస్తూ.. పూజారి మృతి

By A.Ajay· 3h ago
గణపతి పూజ చేస్తూ.. పూజారి మృతి

TG: నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలో గణపతి పూజ చేస్తూ పూజారి మృతి చెందారు. పూజకు ముందు ఇద్దరు యువకులకు పూజారితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత పూజ చేస్తుండగా పూజారి కుప్పకూలి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

More in Local