← Back to news

ద్వారకుంట ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

By A Srisailam· 26 Aug 2026
ద్వారకుంట ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

TG: సూర్యాపేట: కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

More in Local