← Back to news

గుడిలో పెళ్లి.. OYOలో హత్య?

By Prashanth· 1h ago· Hyderabad
గుడిలో పెళ్లి.. OYOలో హత్య?

TG: అమీర్‌పేటలోని Gokul Pride OYOలో 34 ఏళ్ల శిరీష అనుమానాస్పదంగా చనిపోయింది. ఆమెకు 38 ఏళ్ల శ్రీనివాస్‌‌తో ప్రేమ పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 24న ఇద్దరూ OYO రూంలో దిగగా.. నెక్స్ట్ డే శ్రీనివాస్‌ వెళ్లిపోయాడు. గదిలో శిరీష మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్టెన్‌ రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్‌ కోసం గాలిస్తున్నారు.

More in TG