అసెంబ్లీ సమయాన్ని పాడు చేస్తున్నారు: జాన్ వెస్లీ

TG: ప్రజా సమస్యలను పరిశీలించాల్సిన శాసనసభలో అధికార, ప్రతిపక్షాలు ఒకరినొక్కరు తిట్టుకుంటూ విలువైన టైంను పాడు చేస్తున్నారు అని CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. BRS MLC తాతా మధు స్పీకర్ తల్లిని ఉద్దేశించి సంస్కారం లేకుండా మాట్లాడడం బాధాకరమని, దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పారు. సమయాన్ని వృథా చేస్తున్నందుకు అధికార కాంగ్రెస్, BRS శాసనసభ్యులు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


