KTRపై పోలీసులకు కంప్లైంట్

TG: సీఎం రేవంత్‌రెడ్డిపై KTR చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. KTRపై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కి కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. KTR చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా, అవమానకరంగా ఉన్నాయని ఆరోపించారు. BNS సెక్షన్ 356, 352 కింద ఆయనపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, మీడియా ప్రచారానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు భద్రపరచాలనీ, ఆ ఎవిడెన్స్ ఆధారంగా కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్లు రవి కోరారు.


