కరెంట్, నీటి సౌకర్యం లేక ఆలయంలో అవస్థలు

మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ రాముల గుట్ట దేవస్థానం రెండు నెలలుగా విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విద్యుత్ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో నీటి సౌకర్యం కూడా లేకపోవడంతో పనిచేసేవారు చిన్న డబ్బాల్లో నీటిని తీసుకెళ్లి అభిషేకానికి వినియోగిస్తున్నారని తెలిపారు. విద్యుత్, నీరు లేకపోవడంతో ఆలయ పరిసరాల శుభ్రతతో పాటు నిత్య పూజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని భక్తులు చెబుతున్నారు.



