← Back to news

పోలీస్ శాఖలో పోస్టులన్నీ భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్

By DK· 15h ago
పోలీస్ శాఖలో పోస్టులన్నీ భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్

పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని, ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జీ.సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

More in Local