సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై గుంటూరు కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

గుంటూరు జిల్లా పట్నంబజార్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. నిషేధిత ప్లాస్టిక్ గుర్తించి దుకాణాలు సీజ్ చేసి జరిమానాలు విధించారు. 45 రోజులుగా అవగాహన కల్పించినా చర్యలు తీసుకోని సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. తయారీ సంస్థల వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులపై కూడా జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు.



