సైన్‌బోర్డుపై హిందీ.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్!

తమిళనాడులో హైవే సైన్‌బోర్డుపై హిందీ వాడకంపై వివాదం నెలకొంది. తూత్తుకుడి జిల్లాలోని సాత్తాన్‌కుళం–నాజరేత్ SH-93పై ఏర్పాటు చేసిన కొత్త బోర్డులో తమిళం, ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ పేర్లు కనిపించాయి. రాష్ట్ర రెండు భాషల పాలసీకి వ్యతిరేకమని ప్రభుత్వం తెలిపింది. దీంతో హిందీ అక్షరాలను వెంటనే తొలగించి, దీనికి కారణమైన ఇద్దరు హైవే ఆఫీసర్లను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై తమిళనాడులో భాషా విధానంపై మరోసారి చర్చ మొదలైంది.


