ఐసీయూలో ఊడిన పైకప్పు పెచ్చులు

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలే ఆరోగ్యశ్రీ వార్డులోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. వరుసగా పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ఆస్పత్రి భవనం భద్రతపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.



